ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 17 జనవరి 2023 (22:12 IST)

ఈ అనారోగ్య సమస్యలున్న వారు గ్రీన్ టీ తాగకూడదు

green tea
గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి చేసే ప్రయోజనం ఎంతవుందో, ఈ టీని అధికంగా తాగితే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.
 
గ్రీన్ టీ తాగితే రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది కనుక బీపీ పేషెంట్లు తాగకూడదు, అధికంగా తాగితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
 
ఈ టీ ఎక్కువగా తాగడం వలన మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా శోషించుకోలేదు.
 
ఈ టీ తాగడం ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తిని సమస్యలు వస్తాయి.
 
నిద్రలేమితో బాధపడేవారు గ్రీన్ టీ తీసుకోరాదు.
 
ఈ టీని అధికంగా తాగడం వలన జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి అసిడిటీ వ్యాధికి దారి తీస్తాయి.
 
మధుమేహంతో బాధపడేవారు గ్రీన్ టీ తాగడటం మంచిది కాదు.
 
ఐరన్ సమస్య వున్నవారు కూడా గ్రీన్ టీకి దూరంగా వుండటం మంచిది.