శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (12:58 IST)

లవంగం పేస్ట్‌ను కంటిపై ఇలా చేస్తే..?

కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు ఇబ్బందిపెడతుంటాయి. బ్యాక్టీరియా చేరడంవలన గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వలన గాని అలా కురుపు వచ్చినప్పుడు దానిమీద వేడి కాపడం పెట్టాలి. వేడి చేసిన గుడ్డను ఆ కురుపు మీద రోజులో నాలుగైదుసార్లు పెట్టాలి. ఒక చెంచా ధనియాలను ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
 
ఆరోగ్యం చిట్కాలు: 
1. టీ బ్యాగ్‌ని వేడినీటిలో ముంచితీసి దానిని కంటి కురుపుమీద 8-10 నిమిషాలు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా తగ్గేవరకూ చేయాలి. 
 
2. ఒక చెంచా ఉప్పును ఒక కప్పు నీటిలో వేసి ఆ నీరు అరకప్పు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి, వడకట్టిన నీటిని కంటిలో రోజుకు మూడుసార్లు చుక్కలుగా వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
 
3. బంగాళాదుంప గుజ్జు చేసి గుడ్డమీద పరిచి ఆ ముద్దలోపల ఉన్న గుజ్జుతో కురుపు మీద తుడవాలి. 
 
4. ఆముదం చేతివేలు మీద తీసుకుని ఆ కురుపు మీద పలుమార్లు రుద్దితే కురుపు తగ్గుతుంది. జామ ఆకును వేడిచేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి. 
 
5. లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టుకోవాలి.