శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 9 జనవరి 2023 (16:47 IST)

పెరుగు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

పెరుగు. పాల ఉత్పత్తి అయిన ఈ పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ కొంతమంది కొన్ని సందర్భాల్లో ఈ పెరుగుకి దూరంగా వుండాలి. లేదంటే ఆరోగ్యాన్ని అందించే పెరుగే అనారోగ్యాన్ని కలిగించేదిగా మారుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగటం వంటి సమస్యలు వస్తాయి.
 
పెరుగులో గెలాక్టోస్ అనే రసాయన సమ్మేళనం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి
 
పెరుగు అధికంగా తీసుకునేవారిలో ఆహారం నుండి పొందే ఇనుము, జింక్ స్థాయి తగ్గుతుంది
 
ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం రుగ్మతలు, ఇన్ఫ్లమేటరీ పరిస్థితులున్నవారు పెరుగు తీసుకోరాదు.
 
పెరుగును రాత్రిపూట ఎప్పుడూ తినకూడదు.
 
దగ్గు- జలుబు సమయంలో, శ్లేష్మం తీవ్రత పెరుగుతుంది కనుక పాల ఉత్పత్తులకు దూరంగా వుండాలి.