శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 2 జూన్ 2021 (22:59 IST)

అల్లం ముక్కతో బెల్లం కలుపుకుని తింటే ఏమవుతుంది?

బెల్లం మంచి ఔషధం. శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
 
బెల్లాన్ని నువ్వులతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు మద్యాహ్నం, రాత్రి భోజనం అయ్యాక కాస్త బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. కీళ్ల నొప్పుల భాదితులు రోజూ 50 గ్రాముల బెల్లం చిన్న అల్లం ముక్కని కలిపి తినడం వల్ల ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ప్రతిరోజు తాగే పాలల్లో పంచదార బదులు బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
 
అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం తినడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.