గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (11:20 IST)

ఫుడ్‌ పాయిజనింగ్ అయిందా.. ఇలా చేయండి?

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతో పాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. దీంతో కంటికి కనిపించే హోటల్స్, తోపుడు బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్ట

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతో పాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. దీంతో కంటికి కనిపించే హోటల్స్, తోపుడు బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఇలా ఎక్కడబడితే అక్కడ, ఏది దొరికితే అది ఆరగిస్తూ ఆకలి బాధను తీర్చుకుంటున్నాడు. ఇలా ఆరగించడం వల్ల చాలా మంది ఫుడ్‌ పాయిజనింగ్ బారినపడుతుంటారు. దీంతో వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. ఇలాంటివారు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే దీని నుంచి బయటపడొచ్చు. 
 
* కడుపులో వికారంగా అనిపిస్తే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని, నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది. 
* ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను జీలకర్ర వేసి బాగా మరిగించి, ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. 
* పొట్టలో వికారంగా అనిపించినప్పుడు మూడు పూటలా ఒక స్పూను తేనె తీసుకుంటే మంచిది.
* ఫుడ్‌ పాయిజనింగ్ వల్ల వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. దీంతో పొటాషియం పరిమాణం శరీరంలో తగ్గుతుంది. ఫలితంగా నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తినాలి. లేదా రెండు అరటి పళ్లు పేస్టులాచేసి, పాలలో కలిపి తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. 
* పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. ఫుడ్‌ పాయిజనింగ్ అయిన వ్యక్తి ఓ కప్పు పెరుగు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.