మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 జనవరి 2024 (22:17 IST)

రాగి లడ్డూలు, రాగి రొట్టెలు తింటే లాభాలు ఏమిటి?

Ragi Java
చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకు కూడా ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్‌లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు.
రాగి రొట్టెలు తింటుంటే అందులోని కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాల వల్ల ఇవి ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి.

ఎసిడిటీ, గ్యాస్‌తో బాధపడేవారికి రాగి జావ అధ్బుత ఔషధం. రాగులలో కాల్షియంతో పాటు ఫైబర్ వుండటం వల్ల మలబద్దకం, అజీర్ణ సమస్యలు దరిచేరవు. బాలింతలు రాగితో చేసిన లడ్డూలు తింటే పాలు పడతాయి.
 
రక్తహీనత సమస్య నిరోధించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో దోహదపడతాయి. 
డయాబెటీస్, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులను కూడా ఈ రాగులు నివారిస్తాయి.