సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By pnr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (15:20 IST)

'తొక్కే' కదా తీసిపారేయకండి... కమలా ఫలం తొక్కులతో ప్రయోజనాలెన్నో...

ఇది కమలా పండ్లు పుష్కలంగా లభించే సీజన్. ఈ పండ్లు ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇందులో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే, కమలా పండ్లు మాత్రమే కాదు.. ఆ పండ్ల తొక్కులతో కూడా ఎన్నో ప్రయోజనాలు

ఇది కమలా పండ్లు పుష్కలంగా లభించే సీజన్. ఈ పండ్లు ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇందులో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే, కమలా పండ్లు మాత్రమే కాదు.. ఆ పండ్ల తొక్కులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
ఒక్కోసారి ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలా ఫ్రిజ్ నుంచి దుర్వాసన వచ్చినపుడు ఎండబెట్టిన కమలాతొక్కల పొడిని రెండు చెంచాలు తీసుకోవాలి. దాంతో సమానంగా ఉప్పుని కలిపి ఓ పాత్రలో తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ పొడి ఫ్రిజ్‌లోని దుర్వాసనల్నీ, తేమనూ పీల్చుకుంటుంది. పొడి లేకపోతే తాజా కమలాపండు తొక్కల్ని ఉంచినా ఫర్వాలేదు. 
 
నిమ్మజాతి ఫలాల్లో లెమొనేన్‌ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది దోమల్ని, ఈగల్ని దూరం చేస్తే శక్తి ఉంది. ముఖ్యంగా ఈ రసాయన పదార్థం కమలా ఫలంలో 90 శాతం మేరకు ఉంటుంది. అందువల్ల దోమలూ, ఈగల బెడద ఉన్నచోట ఆ తొక్కల్ని ఉంచండి.
 
రంధ్రాలున్న ఓ డబ్బాలో కొన్ని కమలా ఫలం తొక్కలు వేసి దుస్తుల అల్మారాలో ఉంచితే.. సువాసనలు వస్తాయి. స్వీట్ల తయారీలో ఉపయోగించే బ్రౌన్‌ షుగర్‌ త్వరగా గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ తొక్క ఎంతగానో దోహదపడుతుంది. తేమను త్వరగా పీల్చే గుణం ఈ తొక్కల్లో ఉంది. 
 
ఇకపోతే ఒక సీసాలో రెండు కమలాపండ్ల తొక్కలని వేసి అవి మునిగేంతవరకూ వెనిగర్‌ వేయాలి. ఆ సీసాను వారం పదిరోజులు అలానే వదిలేయాలి. తర్వాత ఆ తొక్కలని తొలగించి మిగిలిన వెనిగర్‌ని స్ప్రే సీసాలో తీసుకుంటే చెక్క ఫర్నిచర్‌, ఫ్రిజ్‌, ఓవెన్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులు తుడవడానికి ఉపయోగపడుతుంది.