శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:25 IST)

ఎలాన్ మస్క్ డేటింగ్ ఫోటోల వేలం.. ఎవరు.. ఎక్కడ?

elon musk lover
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్. గతంలో ఈయన పెన్సిల్వేనియాలోని ఓ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఆయన జెన్నిఫర్ గ్వైన్ అనే యువతితో ప్రేమయాణం సాగించారు. కొంతకాలం పాటు డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఎవరిదారి వారు చూసుకున్నారు. ఆ కాలేజీ నుంచి వేరుపడిన తర్వాత వారిద్దరూ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే కలుసుకున్నారట. అయితే, తమ ప్రేమ, డేటింగ్‌కు గుర్తుగా తన వద్ద ఉన్న ఫోటోలను వేలం వేయాలని ప్రియురాలు గ్వైన్ నిర్ణయం తీసుకున్నారు. 
 
అప్పట్లో ఎలా మస్క్‌తో డేటింగ్ సాగించిన సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఇపుడు వేలం వేయాలని నిర్ణయించారు. తన సవతి కుమారుడు స్కూలు ఫీజులు చెల్లించేందుకు తనకు ఇంతకంటే మరోమార్గం కనిపించడం లేదని ఆమె గ్వైన్ వాపోతున్నారు. 
 
ఈ వేలంంలో తమ డేటింగ్ ఫోటోలతో పాటు ఎలాన్ మస్క్ సంతకంతో కూడిన డాలర్ కరెన్సీ నోటు కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ డాలర్ నోటుకు 7604 డాలర్ల వద్ద బిడ్డింగ్ నడుస్తోంది. ఈ బిడ్డింగ్ ఎక్కడ వరకు ఆగి వెళుతుందో వేచి చూడాల్సివుంది.