శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:14 IST)

ప్రపంచ రికార్డు : 127 జీవించిన వృద్ధుడు... ఎక్కడ?

సాధారణంగా మనిషి సగటు జీవిత కాలం 60 నుంచి 70 యేళ్లు. అయితే, బాల్యం నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేవారిలో కొందరు మహా అయితే వందేళ్ళ వరకు జీవిస్తారు. కానీ ఓ వ్యక్తి 127 సంవత్సరాలు జీవించి గత సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన ఆఫ్రికా దేశంలోని అజెఫాలో ఎరిట్రియాలో చోటుచేసుకుంది. 
 
ఇందులో వింతేముంది అంటారా. అయితే ఇతను చనిపోయింది 127 ఏళ్లకని అతని కుటుంబ సంభ్యులు చెబుతున్నారు. అందుకే అతని కుటుంబం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అతన్ని అత్యంత పురాతన వ్యక్తిగా అధికారికంగా గుర్తించాలని కోరింది. అతని మనవడు తాతా పుట్టకకు సంబంధించి పత్రాలను గిన్నీస్ బుక్ వాళ్లకు అందించారు. 
 
తమ ప్రాంతంలో ఉండే చర్చి రికార్డులు ప్రకారం 1894లో నటాబే జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రంలో ఉందన్నారు. అయితే ఆయన జన్మించిన పదేళ్ల తర్వాత బాప్టిజం పొందాడని తెలిపారు. తన తాత 127 ఏళ్లు బతికినట్లు తను ఇచ్చిన సమాచారాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరిస్తున్నాయని మనవడు జీర్ అన్నారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్పష్టం చేయడం లేదు.