బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (09:30 IST)

అమెరికాపై మరిన్ని దాడులు తథ్యం : ఐఎస్ఐఎస్ ప్రకటన

అమెరికాపై మరిన్ని దాడులు తథ్యమని ఉగ్ర సంస్థ ఇసిస్ ప్రకటించింది. మాదేశంలో చొరబడి, మమ్మల్ని హతమారుస్తున్న అమెరికా దళాలకు ప్రతిగా ఆ దేశంలో చొరబడి వారిని హతమారుస్తాం తమవాళ్లు మరింత మంది అమెరికాలో ఉన్నారని

అమెరికాపై మరిన్ని దాడులు తథ్యమని ఉగ్ర సంస్థ ఇసిస్ ప్రకటించింది. మాదేశంలో చొరబడి, మమ్మల్ని హతమారుస్తున్న అమెరికా దళాలకు ప్రతిగా ఆ దేశంలో చొరబడి వారిని హతమారుస్తాం తమవాళ్లు మరింత మంది అమెరికాలో ఉన్నారని, వారంతా దాడులకు తెగబడతారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 
 
తాజాగా లాస్ వెగాస్‌లో దాడికి పాల్పడింది తమసైనికుడేనని చెబుతూ రెండు నిమిషాల నిడివి గల వీడియోని విడుదల చేసింది. అందులో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకే లాస్‌ వెగాస్‌లో నరమేధం సృష్టించామని తెలిపింది. అమెరికా దళాలు సొంత దేశాల్లోని తమను అంతమొదిస్తున్నాయని, అందుకే తాము కూడా అమెరికాలో ప్రవేశించి, అమెరికన్లను అంతమొందిస్తామని తెలిపింది.
 
ఈ మేరకు తమ సైనికులు పని చేస్తున్నారని ఐఎస్‌ఐఎస్ వెల్లడించింది. పెడాక్‌ను కొద్దినెలల క్రితమే ఇస్లాంలోకి మార్చామని, తర్వాత జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశామని అల్ బతార్ మీడియా ఫౌండేషన్ విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ తెలిపింది. మరిన్ని దాడులకు ప్రణాళిక సిద్ధం చేశామని, అమెరికా సిద్ధంగా ఉండాలని సూచించారు.