మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (10:37 IST)

వణికిపోయిన మెక్సికో - రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం

earthquake
మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీవ్రంలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 7.6 తీవ్రతగా నమోదైంది. ఈ భూప్రకంపనల ధాటికి మెక్సికో నగరం దద్దరిల్లిపోయింది. ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటలకు భూకంపం సంభవించింది. 
 
మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్వీలాకు ఆగ్నేయగా 37 కిలోమీటర్లు దూరంలో 15.1 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని మెక్సికో భూకంప శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా మెక్సికో నగరంలోని మిచిగాన్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. 
 
ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు బాగా దెబ్బతిన్నాయి. ఓడరేవు నగరమైన కొలిమాలోని మంజానిల్లోలో ఒక మాల్  వద్ద గోడ కూలిపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కోలో‌కోమన్, మైకోకాన్ ప్రాంతాల్లో ఆస్తి నష్టం అధికంగా ఉంది. 
 
అనేక భవనాలకు పగుళ్లు కూడా వచ్చాయి. కాగా, గత 1985, 2017 సంపత్సరాల్లో సరిగ్గా ఇదే రోజున మెక్సికోలో భూకంపాలు సంభవించినట్టు గత రికార్డులు చెబుతున్నాయి. ఇపుడు మళ్లీ అదే రోజున రావడం గమనార్హం.