అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో తమ 110వ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తోన్న షార్ప్
షార్ప్ కార్పోరేషన్ తమ 110వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 15వ తేదీన జరుపుకుంది. దీనితో పాటుగా అంతర్జాతీయ మార్కెట్, ప్రాంతాల కోసం తమ లక్ష్యంను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వినూత్నమైన ఉత్పత్తులు, కీలకమైన సాంకేతికతల అభివృద్ధి సంస్థగా ఖ్యాతి కలిగిన తమ మహోన్నత వారసత్వంపై ఆధారపడి షార్ప్ ఇప్పుడు నూతన సాంకేతికతలైనటువంటి 8కె, 5జీ ఏఐఓటీలపై ఆధారపడుతూ భావి తరపు ఎలక్ట్రానిక్స్‌కి ఓ ఆకృతినీ అందిస్తుంది. టోకుజి హయకావా 1912లో ప్రారంభించిన షార్ప్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన, నమ్మకమైన బ్రాండ్‌గా వినూత్నమైన సాంకేతికతలపై ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంస్కృతి, ప్రయోజనాలు, సంక్షేమానికి తోడ్పాటునందిస్తుంది.
భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా కార్యక్రమాలను నిర్వహిస్తూ భారతీయుల జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. షార్ప్ ఆఫీస్ సొల్యూషన్స్‌ను విస్తృతంగా ఆఫీస్ వాతావరణంలో వినియోగిస్తున్నారు. వీటిలో మల్టీఫంక్షనల్ ప్రింటర్లు, డైనాబుక్ ల్యాప్‌టాప్స్, వర్క్‌స్పేస్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ వంటివి ఉన్నాయి. తమ 110వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షార్స్ ఇప్పుడు పలు కార్యక్రమాలను ప్రారంభించింది. వీటిలో భారతదేశ వ్యాప్తంగా పలు నగరాలలో కస్టమర్ కనెక్ట్ రోడ్‌షోలు కూడా భాగంగా ఉన్నాయి. సెప్టెంబర్15న కోల్‌కతాలో ప్రారంభమయ్యే ఈ రోడ్ షోలు సంవత్సరం పాటు జరుగుతాయి.
షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా ) ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షిన్జీ మినాటోగవా మాట్లాడుతూ, నిజాయితీ, సృజనాత్మకత అనే మా సిద్ధాంతాలపై షార్ప్ వద్ద మా వ్యాపార వృద్ధి, విజయం నిర్మించబడ్డాయి. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు, ఆవిష్కరణలు చేయడం ద్వారా ప్రజల జీవితాలను మహోన్నతంగా మలుస్తున్నాము. మా 110వ వార్షికోత్సవ వేళ, మేము మా నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా నాణ్యత పరంగా నూతన బెంచ్‌మార్క్‌లను ఏర్పాటుచేస్తున్నాము. తద్వారా ఆధారపడతగిన, మన్నికైన, సమర్ధవంతమైన వర్క్‌స్పేస్ పరిష్కారాలను సింప్లీ బెటర్ బిజినెస్, సింప్లీ బెటర్ లైఫ్ వాగ్ధానంతో అందిస్తున్నామన్నారు.
ఈ 110 వ వార్షికోత్సవ వేళ నూతన మేనేజ్‌మెంట్ వ్యవస్థను సైతం షార్ప్ పరిచయం చేయడం ద్వారా తమ ఈఎస్‌జీ పునరుద్ఘాటించింది. తమ పర్యావరణ పాలసీ, బలమైన వ్యాపార విలువలతో పర్యావరణ భారాన్ని సైతం తగ్గించేందుకు షార్ప్ ప్రయత్నిస్తోంది. స్టేక్ హోల్డర్ల మద్దతుకు కృతజ్ఞతగా వినూత్నమైన 110 సంవత్సరాల లోగోను సైతం విడుదల చేసింది.