సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 28 జులై 2017 (01:52 IST)

భారత్ ప్రతిదాడి చేస్తుందన్న భయం వెంటాడింది. లేకుంటే అణుబాంబు వేసేవాడినే.. ముషార్రఫ్

పిచ్చివాడి చేతిలో రాయి అని మన పూర్వీకులు ఊరికే అనలేదు. అసలే కోతి.. ఆపై కల్లు తాగింది అన్న చందాన అసలే సైనిక జనరల్, దానికి తోడు దేశాధ్యక్షపదవిని కుట్రపూరితంగా చేజిక్కించుకున్నాడు ఇక పగ్గాలుంటాయా. ఉండవు

పిచ్చివాడి చేతిలో రాయి అని మన పూర్వీకులు ఊరికే అనలేదు. అసలే కోతి.. ఆపై కల్లు తాగింది అన్న చందాన అసలే సైనిక జనరల్, దానికి తోడు దేశాధ్యక్షపదవిని కుట్రపూరితంగా చేజిక్కించుకున్నాడు ఇక పగ్గాలుంటాయా. ఉండవు గాక ఉండవు. ఆ దౌర్భాగ్యుడు అన్నంతపనీ చేయడం గురించి ఆలోచించి బుర్రబద్దలు గొట్టుకున్నాడు. పొరుగు దేశం ఉతికిఆరేస్తుందన్న భయంతో ఆగిపోయాడు లేకుంటే 1945 తర్వాత ప్రపంచంలో మళ్లీ అణుబాంబు పేల్చిన తొలి ముష్కరుడుగా చరిత్రకెక్కేవాడు. ఆ ముష్కరుడి పేరు ముషార్రఫ్
 
భారత్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలి అని ఒక దశలో అనుకున్నట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ బయటపెట్టాడు. ఆలస్యంగానే విషయాన్ని వెల్లడించినప్పటికీ రాజకీయ వేషం వేసిన సైనికాధికారి ఆలోచనలు ఎంత వక్రంగా ఉంటాయో, ఎంత ప్రమాదకర స్థితిలోకి ప్రపంచాన్ని నెట్టేయగలరో ముషార్రఫ్ రుజువు చేసేశాడు. భారత్  పార్లమెంటుపై ఉగ్రవాద దాడులు జరిగి పాకిస్తాన్‌తో యుద్ధం తప్పదని భారత ప్రభుత్వం స్థిర నిర్ణయానికి వచ్చినప్పుడు యుద్ధమే వస్తే ఇండియాపే అణుబాంబు ప్రయోగించాలా  వద్దా అన్నదానిపై తాను 2002లో తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ ఇటీవల తెలిపారు. 
 
2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్‌ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్‌ ఓ జపాన్‌ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు.
 
అయితే ఆలోచన చేసాడు కానీ దాని పరిణామాలు తల్చుకుని భీతిల్లానని దాంతో అణ్వాయుధాలను సిద్ధం చేయాలని కూడా తాను పాక్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వలేదని ముషార్రఫ్ చావు నిజం లేటుగా చెప్పాడు. అణ్వాయుధాలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించగా ‘అప్పటికి క్షిపణులు అణ్వస్త్రాలతో సిద్ధంగా లేవు. ఆదేశాలు ఇచ్చి ఉంటే మరో రెండు రోజులకు సిద్ధమయ్యేవి. కానీ క్షిపణులకు వార్‌హెడ్లను అమర్చాలన్న ఆదేశాలను కూడా నేను ఇవ్వలేదు’ అని ముషార్రఫ్‌ చెప్పారు. 
 
1999 అక్టోబరులో నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్‌ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు.