గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:22 IST)

జూమ్ ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా... ఓ విద్యార్థిని తల్లిపై అలా జరిగింది..?

ఆన్‌లైన్ క్లాసు జరుగుతుండగానే దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లి.. జూమ్ ఆన్‌లైన్ తరగతులు జరుగుతుండగా హత్యకు గురైంది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జూమ్‌ క్లాస్‌ ప్రారంభం కాగానే బాలిక తల్లి మర్బియల్‌ రొసాడో మోరేల్స్‌ (32)ను ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ డొనాల్డ్‌ జే విలియమ్స్‌ (27) కాల్చి చంపాడు. ఈ ఘటనలో రొసాడో మోరేల్స్ మరణించగా.. గంటకు తర్వాత జే విలియమ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో జూమ్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. 10 ఏళ్ల బాలిక కూడా క్లాస్ వినాలని అనుకుంది. ఈ దారుణం చోటుచేసుకున్న సమయంలో ఆ ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నారని.. వారంతా ఈ దారుణాన్ని చూసారని పోలీసులు తెలిపారు.
 
మోరేల్స్‌ ఇంట్లోకి చొరబడిన విలియమ్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఓ వీడియోపై ఆమెను ప్రశ్నించాడని, ఆమె నవ్వుతూ బదులిస్తుండగా ఆగ్రహంతో విలియమ్స్‌ ఆమెపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. 2015లో విలియమ్స్‌ తాను దొంగిలించిన తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
ఈ ఘటన జరిగిన సమయంలో ఏదో ఆ 10 ఏళ్ల బాలిక కంప్యూటర్‌కు తగిలింది. మోరేల్స్ ముగ్గురు పిల్లలతో పాటూ, ఇద్దరు కజిన్స్ కూడా అక్కడే ఉన్నారు. పిల్లల వయసు 10 నుండి 17 సంవత్సరాలు ఉందని పోలీసులు తెలిపారు.
 
మోరేల్స్, విలియమ్స్ విడిపోయి సంవత్సరం పైనే అవుతోంది. డొమెస్టిక్ వయొలెన్స్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లి మరణానికి స్కూల్ శ్రద్ధాంజలిని ఘటించింది.