శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (14:27 IST)

జూ నుంచి తప్పించుకున్న కొండచిలువ అక్కడ ప్రత్యక్షమైంది... (వీడియో వైరల్)

లూసియానాలోని ఓ బ్లూ అక్వేరియం జూ నుంచి ఓ కొండ చిలువ తప్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు హైరానా పడిపోయారు. తప్పిపోయిన కొండ చిలువ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో ఈ కొండ చిలువు ఓ షాపింగ్ మాల్‌లోకి చేరినట్టు సమాచారం అందుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అక్కడకు వెళ్లి దాన్ని పట్టుకుని తిరిగి జూ తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. ఎంతో పకడ్బందీగా ఉండే ఎన్‌క్లోజర్‌ నుంచి ఎలా తప్పించుకుందో అధికారులకు అర్థం కాలేదు. రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని అధికారులు కారా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
అలా చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలిసింది. ఇంకేముంది షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని.. వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో కథ సుఖాంతమైంది.
 
దీనిపై జూ ప్రధానాధికారి రోండా స్వాన్సన్ స్పందిస్తూ, ''మాకు కారా తప్పిపోయిందని తెలిసినప్పటి నుంచి దానిని వెతికే ప్రయత్నంలో పడ్డాం. రెండురోజుల పాటు నిద్రహారాలు మాని కారా కోసం గాలించాం. చివరికి గురువారం ఒక షాపింగ్‌మాల్‌లో చిన్న సందు ద్వారా గోడ సీలింగ్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. కారాను సురక్షితంగా బయటికి తీసి ఎన్‌క్లోజర్‌లో పెట్టేశాం'' అంటూ వివరించారు.