ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (08:16 IST)

పంజాబ్ కింగ్స్‌పై లక్నో ఘనవిజయం.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్

Lucknow Super Giants
Lucknow Super Giants
పంజాబ్ కింగ్స్‌పై మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లో పసికూన అయిన లక్నో.. పంజాబ్‌పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
258 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ బాగుంది. దీంతో అధర్వ తైడే 66, సికిందర్ రజా 36 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. 
 
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. 
 
లక్నో ఆటగాళ్లలో స్టాయినిస్ 72 పరుగులు, కైల్ మేయర్స్ 54, ఆయుష్ బదోనీ 43, నికోలాస్ పూరన్ 45 పరుగులు సాధించారు. ఈ గెలుపుతో లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.