గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:20 IST)

ధోనీకి నమస్కారం.. జడేజా.. అంబటి రాయుడు వీడియో వైరల్

Dhoni
Dhoni
ఐపీఎల్ 2022లో కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా రోజుల తర్వాత తన సత్తా చాటాడు. ముంబైతో గురువారం జరగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోనీ.. తన మాయాజాలంతో ఆకట్టుకున్నాడు.
 
ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో.. చెన్నై విజయం సాధించాలంటే చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరం అయ్యాయి. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే రాగా.. ఆఖరి నాలుగు బంతులను వరుసగా 6, 4, 2, 4 కొట్టిన ధోని చెన్నైకు అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.  
 
156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ను ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టడి చేశారు. దాంతో 19 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 139/6గా నిలిచింది. చివరి ఓవర్లో చెన్నై విజయం సాధించాలంటూ 17 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో ధోనీ రెచ్చిపోయాడు. 
 
పిచ్ చాలా నెమ్మదిగా ఉండటంతో బంతిని మిడిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అయితే ధోని తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ఆఖరి నాలుగు బంతులను వరుసగా 6, 4, 2, 4 పరుగులు సాధించాడు. దాంతో చెన్నై సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. 
 
అంతకుముందు ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. బ్రావో రెండు వికెట్లతో సత్తా చాటాడు.
 
ఈ మ్యాచ్ ముగిశాక జడేజా.. ధోని ముందు 'వాట్ ఏ ఇన్నింగ్స్ టేక్ ఏ బౌ' అన్నట్లు మోకరిల్లాడు. అతడి వెనుకే ఉన్న అంబటి రాయుడు సైతం ధోనికి నమస్కారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.