ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. రికీ పాంటింగ్ కామెంట్స్ వెనుక?
Rishabh Pant_Ricky Ponting
ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ మొత్తం ఐపిఎల్ ఆడతాడని నమ్మకంగా ఉన్నానని చెప్పాడు. డిసెంబరు, 2022లో పంత్ కారు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రమాదం నుంచి ఏర్పడిన తీవ్రగాయాల నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా ఆడగలడనే స్థాయికి పంత్ ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో "రిషబ్ చాలా నమ్మకంగా వున్నాడని, ఏ హోదాలో ఆడుతాడనే మాత్రం కచ్చితంగా తెలిదని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. అన్ని ఆటలు కాకపోయినా, రిపబ్ పంత్ 14 మ్యాచ్‌ల్లో పది మ్యాచ్‌లైనా ఆడుతాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. జట్టుకు కెప్టెన్‌గా పంత్ లేకపోవడం గత ఏడాది లోటును మిగిల్చింది. ప్రతి గేమ్‌ను ఆడుతానని పంత్ స్పష్టంగా చెప్తున్నాడు. నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తానంటున్నాడు. అతను చాలా డైనమిక్ ఆటగాడు. అతను స్పష్టంగా మా కెప్టెన్... రోడ్డు ప్రమాదం ఘటన నుంచి బయటపడటం అదృష్టం అనే చెప్పాలంటూ" రికీ వ్యాఖ్యానించాడు. రికీ కామెంట్స్ ప్రకారం పంత్ కెప్టెన్సీ ద్వారా మళ్లీ ఐపీఎల్ లోకి వచ్చే ఛాన్సుందని క్రీడా పండితులు అంటున్నారు.