శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (11:02 IST)

9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న అమేజాన్

Amazon
గత కొన్ని నెలలుగా ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన అమేజాన్.. ఇప్పుడు మళ్లీ 9 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా సంచలనం రేపింది. ఏప్రిల్‌లో కొన్ని విభాగాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమేజాన్ తొలగించాలని యోచిస్తున్నట్లు సీఈవో అంట్జెక్ తెలిపారు. 
 
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ట్విటర్‌తో సహా పలు కంపెనీలు గత కొన్ని నెలలుగా ఉద్యోగాల కోతపై ఇప్పటికే చర్యలు చేపట్టగా, పెద్ద కంపెనీలు రెండవ దశ ఉద్యోగాల కోత‌తో షాక్‌ను కలిగించాయి. లేఆఫ్ ల వల్ల నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.