మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:20 IST)

శుభవార్త చెప్పిన యాపిల్ సంస్థ.. ఏంటది?

apple iPhone
లగ్జరీ అండ్ కాస్ట్లీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ సంస్థ తయారు చేసే ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఐఫోన్ 14 తయారీని భారత్‌లో ప్రారంభించినట్టు తెలిపింది. 
 
తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో కేంద్రంగా ఉన్న ఫాక్స్‌కాన్ సంస్థతో కలిసి యాపిల్ సంక్థ ఈ ఫోన్లను తయారు చేయనుంది. దీంతో అతి త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా ఐపోన్ 14 త్వరలోనే దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇప్పటివరకు ఐఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు దేశీయంగా తయారుచేయనున్న నేపథ్యంలో ఈ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.