బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (16:14 IST)

ట్విటర్‌లో పెను మార్పులు.. బ్లూటిక్‌కు రూ.661 చెల్లించాల్సిందే...

twitter deal elon musk
మైక్రోబ్లాగింగ్ మెసేజింగ్ సైట్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, బ్లూటిక్‌కు 8 డాలర్లు చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అంటే భారత కరెన్సీలో 661 రూపాయలన్నమాట. ఇప్పటివరకు ఈ ఫీజు రూ.410గా ఉండేది. 
 
కాగా, ఈ ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తర్వాత అందులోని టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్.. ఇపుడు విధి విధానాల మార్పుపై దృష్టిసారించారు. ట్విట్టర్‌లో సెలెబ్రిటీ ఖాతాలకు కేటాయించే బ్లూటిక్ ఫీజును పెంచుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇక నుంచి బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు చొప్పున చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అయితే, ఈ ధర ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందని తెలిపారు. అలాగే, దీనిపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన గట్టిగానే సమాధానమిచ్చారు. 
 
"ఫిర్యాదులు, విమర్శలు చేసే వారందరికీ ఒక్కటే చెబుతున్నా... దయచేసి మీరు ఫిర్యాదు చేస్తూనే ఉండండి.. కానీ, దీని ఖరీదు మాత్రం 8 డాలర్లు" అంటూ బ్లూటిక్ ఫీజుపై తన నిర్ణయాన్ని ఆయన స్పష్టం చేశారు.