ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (16:29 IST)

చాట్‌జీపీటీకి పోటీగా "బార్డ్‌" సిద్ధం

Google
చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా మరో చాట్ బాట్ బార్డ్‌ సిద్ధం అయ్యింది. చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను రంగంలోకి దింపనున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ రూపొందించిన "చాట్‌జీపీటీ"కి  గూగుల్ ఈ చాట్‌బాట్‌ సవాలుగా మారనుంది. 
 
గూగుల్‌కు చెందిన లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ ఆధారంగా ఈ చాట్‌బాట్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ చాట్ బాట్ పరీక్ష దశలో వుంది. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల తన బ్లాగులో రాసుకొచ్చారు. 
 
గూగుల్ సంస్థ తన సెర్చ్ ఆల్గోరిథమ్‌ను కృత్రిమ మేథ రంగంలో అగ్రగామిగా వ్యాఖ్యానించింది. అయితే.. చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇందుకు పోటీగానే చాట్ బాట్ బార్డ్‌‌ను రంగంలోకి దించనుంది.