జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... వినియోగదారులకు బంపర్ ఆఫర్...
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింతమంది వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ బంపర్ ఆఫర్‌ను వెల్లడించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు కావడం గమనార్హం.
ఈ వివరాలను పరిశీలిస్తే, జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.909తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు కాలపరిమితి కలిగివుంటుంది. రోజుకు 2జీబీ చొప్పున డేటా పొందవచ్చు. అంటే మొత్తం 84 రోజులకు 168 జీబీల మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చు. అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌కు సోనీలివ్, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటాను వినియోగిస్తే నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోనుంది. ఒక వేళ హైస్పీడ్ డేటా ప్లాన్స్ కావాలనుకునేవారు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.