ఇయర్ బడ్స్‌ను విడుదల చేసిన శాంసంగ్..
మీరు సంగీత ప్రేమికులా? వైర్ లేదా వైర్‌లెస్ హెడ్‌సెట్‌లను ఉపయోగించి విసిగిపోయారా? అందుకే శాంసంగ్ సంస్థ మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అవే వైర్‌లెస్ ఇయర్ బడ్స్. శాంసంగ్ సంస్థ వీటిని ఇవాళ భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటికి బిక్స్‌బీ అసిస్టెంట్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీనిని ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు.
ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.0 వెర్షన్ ద్వారా ఫోన్‌లకు కనెక్ట్ అవుతాయి. వీటిలో 252 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అమర్చారు. అందువలన ఈ ఇయర్ బడ్స్‌ను 5 గంటల వరకు ఉపయోగించవచ్చు. వీటి ధర రూ.9,990గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదలైన ఈ ఇయర్ బడ్స్‌కి బాగా ఆదరణ లభిస్తుందని కంపెనీ ఆశిస్తోంది.