సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 మార్చి 2022 (22:52 IST)

భారతదేశపు మొట్టమొదటి 6జీబీ RAM- 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌

అంతర్జాతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, టెక్నో తమ సుప్రసిద్ధ స్పార్క్ 8 సిరీస్‌లో భాగంగా తమ తాజా ఆఫరింగ్‌ TECNO SPARK 8C ను విడుదల చేసింది. ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌, 90 హెర్ట్జ్‌ అత్యున్నత రిఫ్రెష్‌ రేట్‌, 6.6 అంగుళాల హెచ్‌డీ+ రిచ్‌ డిస్‌ప్లే, భారీ 5000mAh బ్యాటరీ, 13MP AI డ్యూయల్‌ రియర్‌ కెమెరా వంటివి ఈ ఫోన్‌లో ఉన్నాయి. 

 
దీనిలో 3 GB ఇన్‌స్టాల్డ్‌ RAM ఉంది. దీనిని 3GB RAM వరకూ మెమరీ ఫ్యూజన్‌ చేయవచ్చు. ఇతర ఫీచర్లలో IPX2 స్ల్పాష్‌ రెసిస్టెంట్‌, డీటీఎస్‌ సౌండ్‌, హై పార్ట్, యాంటీ ఆయిల్‌ స్మార్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌, 3-ఇన్‌-1సిమ్‌ స్లాట్‌, డ్యూయల్‌ 4G VoLTE ఉన్నాయి. ఇది Android 11 ఆధారిత HiOS 7.6 శక్తితో పనిచేస్తుంది.

 
ఈ ఆవిష్కరణ గురించి అర్జీత్‌ తాలపత్ర, సీఈవో-ట్రాన్సిషన్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ అనుభవాలను సరసమైన ధరలలో మా వినియోగదారులకు అందించాలన్నది తమ లక్ష్యం. TECNO SPARK 8C స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణ దీనికి ప్రతి రూపంగా నిలుస్తుంది’’ అని అన్నారు.

 
ఐకానిక్‌ డిజైన్‌తో గ్లోసీ ఫినీష్‌, పంచీ కలర్స్‌లో మాగ్నెట్‌ బ్లాక్‌, ఐరీస్‌ పర్పుల్‌, డైమండ్‌ గ్రే మరియు టర్క్యూస్‌సియాన్‌ వంటి రంగులు TECNO SPARK 8C ని చూడగానే ఆకట్టుకునే స్మార్ట్‌ఫోన్‌గా మలుస్తాయి.

 
నిశాంత్‌ సార్దన డైరెక్టర్-మొబైల్‌ ఫోన్స్‌, అమెజాన్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘TECNOతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరల విభాగంలో అందిస్తుంది’’ అని అన్నారు.