మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:56 IST)

కళ్యాణ మండపంలో వధూవరులపై యాసిడ్ దాడి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కళ్యాణ మండపంలో నూతన వధూవరులపై ఈ యాసిడ్ దాడి జరిగింది. వధూవరులపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో వధువు, వరుడు, ఇద్దరు పిల్లతో పాటు మొత్తం 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
పెళ్లి వేడుకలో కరెంట్ పోయిన సమయంలో ఈ దాడి జరగడంతో ఎవరు దాడి చేశారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భాన్‌పురి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. బస్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీత్ కశ్యప్ (19)లకు పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో వారి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇందులో కరెంట్ పోవడంతో కళ్యాణ మండలంలో అంధకారం నెలకొంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వధూవరులపై యాసిడ్ దాడి చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.