సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (10:56 IST)

పుల్వామా తరహా దాడికి ప్లాన్ .. భగ్నం చేసిన సైనిక బలగాలు

జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు భారీ విధ్వంసానికి ప్రయత్నించారు. ముఖ్యంగా, పుల్వామా దాడి తరహా ఘటనకు ముమ్మర ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నంలో భాగంగా, 20 కిలోల భారీ పేలుడు పదార్థాలతో కూడిన లారీని భారత భూభాగంలోకి పంపించారు. 
 
దీన్ని భారత బలగాలు పసిగట్టి ఎలాంటి ప్రమాదం జరుగకుండా స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే, ఓ కారునుకూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
పుల్వామాలోని అవిగుండ్ రాజ్‌పొరా ప్రాంతంలో న‌కిలీ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌తో వెళ్తున్న వాహ‌నాన్ని గురువారం ఉద‌యం చెక్ పాయింట్ వ‌ద్ద భ‌ద్ర‌తా ద‌ళాలు అడ్డుకున్నాయి.
 
కానీ ఆ వాహ‌నం బారికేడ్ల‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఆ స‌మ‌యంలో సెక్యూరిటీ ద‌ళాలు ఫైరింగ్‌కు దిగాయి. సాంట్రో కారును వ‌దిలేసి.. డ్రైవ‌ర్ త‌ప్పించుకుని పారిపోయాడు. ఐఈడీల‌తో ఉన్న వాహ‌నాన్ని అక్క‌డ వ‌దిలేసి వెళ్లిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ విజ‌య్ కుమార్ తెలిపారు. 
 
ఉగ్ర‌దాడికి ప్లాన్ వేసిన‌ట్లు త‌మ‌కు ఇంటెలిజెన్స్ స‌మాచారం వ‌చ్చిన‌ట్లు అధికారి తెలిపారు. బుధవారం నుంచి ఐఈడీల‌తో ఉన్న వాహ‌నం కోసం త‌నిఖీ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఐఈడీల‌తో ఉన్న కారును.. బాంబు స్క్వాడ్ పేల్చేసింది. 
 
ఈ ఘ‌ట‌న వ‌ల్ల‌ స‌మీపంలో ఉన్న కొన్ని ఇండ్లు దెబ్బ‌తిన్న‌ట్లు సమాచారం. సైన్యం, పోలీసులు, పారామిలిట‌రీ ద‌ళాలు సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో భాగంగా ఐఈడీ వాహ‌నాన్ని ప‌ట్టుకున్న‌ట్లు ఐజీ విజ‌య్ కుమార్ తెలిపారు. 
 
కాగా, గ‌త 2019, ఫిబ్ర‌వ‌రిలో పుల్వామాలోనే సీఆర్‌పీఎఫ్ వాహ‌న‌శ్రేణిని ఐఈడీల‌తో నిండిన వాహ‌నం ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో 40 మంది జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఇండోపాక్ మ‌ధ్య స్వ‌ల్ప యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.