శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (09:04 IST)

ప్రయాణానికి ‘ఆరోగ్యసేతు’ యాప్ తప్పనిసరి కాదు

ప్రయాణాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదని, అది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది.

బెంగళూరుకు చెందిన ఓ సైబర్ కార్యకర్త ఈ యాప్‌కు సంబంధించి పలు సందేహాలు వెలిబుచ్చుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.
 
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు ఎవరికి వారే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ కోర్టుకు తెలిపారు.

ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించవచ్చని కోర్టుకు తెలిపారు.