శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (08:10 IST)

నేటి నుంచి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం

plastic ban
నేటి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలుకానుంది. ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి.. తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కోరారు. 
 
పైగా, ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా, జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయన్నారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తారు. 
 
అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. నిషేధానికి సహకరించే పౌరుల సహాయార్థం ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని కూడా రూపొందించారు. మొత్తంమీద ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిని కొంతమేరకు నివారించేందుకు ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నారు.