బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (09:29 IST)

వధువు గుండెపోటుతో మృతి.. వరుడికి ఆమెతో పెళ్లి.. ఎవరు?

bride
ఆ ఇంట పెళ్లి సందడి. కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి వుండగా.. పెను విషాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి వధువు కుప్పకూలింది. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే పెళ్లి మాత్రం ఆగలేదు. కుమార్తె మృతి బాధను మనసులో పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మరో కుమార్తెతో వివాహం జరిపించారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్దకుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో పెళ్లి నిశ్చయమైంది. గురువారం వివాహం జరగాల్సి ఉండగా వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. 
 
అదే సమయంలో వధువు హేతల్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. 
 
ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగకూడదని నిర్ణయించుకున్న వారు హేతల్ స్థానంలో ఆమె చెల్లిలిని ఇచ్చి పెళ్లి జరిపించారు. హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి వచ్చి వివాహం జరిపించారు.