సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (11:50 IST)

పెళ్లైన కొత్త.. వంట నేర్చుకోమన్న పాపం.. యువతి ఆత్మహత్య

cook
పెళ్లి దగ్గర పడుతుంది. వంట నేర్చుకోమని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడు తిరునల్వేలిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా కీలగోడంకుళంకు చెందిన క్రిస్టిల్లా మేరీ అనే యువతికి ఇటీవలే నిశ్చితార్థం జరగగా, ఫిబ్రవరి 1న వివాహం జరగాల్సి ఉంది. క్రిస్టిల్లా మేరీ ప్రతిరోజూ తన సెల్ ఫోన్‌ను చూస్తూ ఉండేదని చెబుతున్నారు. 
 
పెళ్లి దగ్గర పడుతుండటంతో వంట నేర్చుకోవాలని తల్లి మందలించిందని, విసుగు చెందిన యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనపై క్రిస్టిల్లాను వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.