మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (14:48 IST)

రాహుల్ గాంధీపై అనర్హత వేటు - తీర్పు తర్వాత లోక్‌సభకు...

rahul gandhi
దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, దీనిపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. 
 
అదేసయమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే  శుక్రవారం ఆయన పార్లమెంటుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హజరయ్యారు. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశంలో పాల్గొన్నారు.
 
మరోవైపు, రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధాని దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.