ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మే 2020 (12:17 IST)

నువ్వు తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందంటే?

తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందని మందలించిన కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వావి వరుసలు లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించిన యువకుడిని మందలించడం కారణంగా చెన్నైలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, పుళల్, వినాయకపురంకు చెందిన శరవణ్. ఇతనికి గుణసుందరి అనే భార్య వుంది. 
 
శరవణన్ తమ్ముడు లోగు.. గత ఆరునెలల క్రితం మరణించాడు. ఈ నేపథ్యంలో శరవణన్ అన్న కొడుకు గణేశన్‌తో లోగు భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎన్నోసార్లు లోగు భార్య, గణేశన్‌తో శారీరకంగా కలిసింది. గణేశన్‌కు వివాహమైనా భార్యతో మనస్పర్ధల కారణంగా ఆమెకు దూరంగా వున్నాడు. అయితే పిన్ని వరుస అయ్యే లోగు భార్యతో రాసలీలలు కొనసాగించాడు. 
 
ఈ విషయాన్ని శరవణన్ భార్య గుణసుందరి తీవ్రంగా ఖండించింది. అంతేగాకుండా గణేశన్‌తో వాగ్వివాదానికి దిగింది. దీంతో ఆవేశానికి గురైన గణేశన్ గుణసుందరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గుణ సుందరి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గణేశన్‌ను వెతికే పనిలో పడ్డారు.