శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (15:07 IST)

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి కొరఢా దెబ్బలు.. ఎందుకు? వీడియో వైరల్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గోవర్ధన్ పూజను ఎంతో నియమనిష్టలతో ప్రత్యేకంగా చేస్తారు. ప్రతియేడాది ఈ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తులు కొరఢాతో కొట్టించుకుంటారు. ఇలా గోవ‌ర్థన్ పూజ అనంత‌రం కొరఢా దెబ్బలు తింటే స‌మ‌స్య‌లు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. 
 
ఈ పూజలో ఛత్తీస్‌గఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్‌ బఘేల్ కూడా పాల్గొన్నారు. శుక్రవారం దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవ‌ర్ధ‌న్ పూజ‌కు హాజ‌రైన బ‌ఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. జంజిగిరి గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ సీఎం భూపేశ్ బ‌ఘేల్‌ను కొరఢాతో కొట్టారు. 
 
ఆ త‌ర్వాత బ‌ఘేల్ మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవ‌ర్ధ‌న్ పూజా కార్యాక్ర‌మం చాలా గొప్ప‌సంప్ర‌దాయం అన్నారు. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను మ‌రిచిపోకుండా భావి త‌రాల‌కు అంద‌జేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అన్నారు. కాగా, సీఎం కొర‌డాతో కొట్టించుకున్న దృశ్యాల‌ను కింది వీడియోలో వీక్షించ‌వ‌చ్చు.