24 అంతస్థుల భవనం నుంచి కిందపడి ఇంటర్ విద్యార్థి మృతి.. కారణం?
24 అంతస్థుల భవనం నుంచి కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ నోయిడాలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో అత్యంత ఎత్తైన భవనం 24వ అంతస్తు నుంచి పడి మృతి చెందడంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
మృతుడి పేరు ప్రణవ్. ప్రాథమిక విచారణలో ప్రణవ్‌ది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రణవ్ తండ్రి డాక్టర్ అమన్ శ్రీవాస్తవ ఐఎంటీ దుబాయ్‌లో ప్రొఫెసర్. తల్లి న్యాయవాది.
వాస్తవానికి వీళ్లు గోరఖ్‌పూర్ నివాసితులుగా తెలిసింది. 24వ అంతస్థు నుంచి ప్రణవ్ ఎలా పడిపోయాడనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెప్పారు.