ద్రౌపది ముర్ము అనే నేను.. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె దేశ 15వ రాష్ట్రపతి అయ్యారు. పైగా, ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ ముర్ము కావడం గమనార్హం. గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా పని చేశారు.
అదేసమయంలో దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ చరిత్ర సృష్టించారు. అంతేకాకుకండా, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతిపిన్న వయసు వ్యక్తి కూడా కావడం గమనార్హం.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓ ప్రకాష్ బిర్లా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇటీవలి జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.