గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (22:32 IST)

మద్యం మత్తు..రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు.. చివరికి?

Lorry
పంజాబ్‌లోని లుథియానాలో మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు. తాగిన మత్తులో రైలు పట్టాలపై లారీని నడిపించాడు. 
 
ఇంతలో రైలు రావడంతో చాలా టెన్షన్ పడ్డాడు. లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తుపట్టాడో తెలీదు కాని లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తొచ్చినట్లుంది. వెంటనే జాగ్రత్తపడ్డాడు. 
 
లారీని పట్టాలమీదే వదిలేసి పారిపోయాడు. పొరపాటున లోకో పైలట్ కాని జాగ్రత్త పడి ఉండకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. 
 
ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.