బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జులై 2020 (05:59 IST)

ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం: బెంగాల్ సీఎం

కరోనాతో కన్నుమూసే ఉద్యోగుల కుటుంబాల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎనలేని కనికరం చూపింది. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.

కరోనాతో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందితే.. వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడిన సీఎం ఈ మేరకు ప్రకటించారు.

కరోనా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా విస్తరిస్తుందని.. ఎవరైనా కోవిడ్-19 వల్ల మృతి చెందితే వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

ఇప్పటి వరకూ పశ్చిమబెంగాల్ లో 268 మంది పోలీసులు, 30 మంది డాక్టర్లలు, 43 మంది నర్సులు, 62 మంది ప్రభుత్వ అధికారులు కరోనా బారినపడి మృతి చెందారని మమతా బెనర్జీ తెలిపారు.