శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (12:20 IST)

మూవీ రేటింగ్ పేరిట కొత్త స్కామ్.. రూ.76లక్షలు గోవిందా

cyber hackers
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మూవీ రేటింగ్ పేరిట కొత్త స్కామ్ నడుస్తోంది. ఆన్‌లైన్‌లో సినిమా రివ్యూ పేరిట గురుగ్రామ్‌కు చెందిన మహిళను రూ.76లక్షలకు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఆన్‌లైన్లో మూవీ టిక్కెట్లు కొనుగోలు చేయండి. బాలీవుడ్, హాలీవుడ్, దక్షిణాది సినిమాలను వీక్షించండి. అదనపు ఆదాయం పొందండి అంటూ గురుగ్రామ్‌కే చెందిన ఓ జంట నుంచి మోసగాళ్లు రూ.కోటి రాబట్టిన ఘటన మరవకముందే.. మరో మహిళ రూ.76 లక్షలకు మోసపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న దివ్య అనే మహిళ పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మోసగాళ్లకు చిక్కింది. మొబైల్ యాప్‌లో సినిమాలను చూసి రేటింగ్ ఇస్తే చాలంటూ ఉచ్చులోకి లాగారు. ఆమెకు టెలిగ్రామ్‌లో మీరా అనే మహిళ నుంచి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ జాబ్ ద్వారా లక్షలు కోల్పోయింది. 
 
రూ.10,500 డిపాజిట్ చేయాలని కోరారు. ఈ మొత్తాన్ని రేటింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవచ్చని నమ్మించారు. అలా రకరకాల మాయ కబుర్లు చెబుతూ ఆమెతో రూ.76.84 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. దీంతో ఆ మహిళ మోసపోయిందనే విషయం గ్రహించి తలపట్టుకుంది.