శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (17:24 IST)

కోడలికి అండగా అత్తమామలు.. భర్త చనిపోయినా.. వేరొక వ్యక్తితో..?

పెళ్లైన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. కానీ ఆ వృద్ధ అత్తమామలు.. కోడలికి అండగా నిలిచారు. ఆమెను చదివించి ఉద్యోగం పొందేలా ప్రోత్సహించారు. 
 
అంతటితో ఆగలేదు.. కోడలికి వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ ఆదర్శ అత్తమామల గురించిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన కమలా దేవి, దిలావర్ దంపతుల కుమారుడు శుభమ్‌కు 2016లో సునీత అనే యువతితో వివాహం జరిగింది.
 
వివాహం జరిగిన ఆరు నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుభమ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సునీత ఒంటరి అయిపోయింది. పేద కుటుంబానికి చెందిన సునీతను కమలా దేవి దంపతులు వదులుకోలేదు.
 
ఆమెను తమ దగ్గరే ఉంచుకుని చదివించారు. అత్తమామల ప్రోత్సాహంతో సునీత ఎమ్.ఎ.బీ.ఈడీ చదవింది. పోటీ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్‌గా కూడా ఎంపికైంది.
 
సునీత్ జీవితంలో స్థిరపడింది. ఇంకా ఆడిటర్ ముఖేష్‌ అనే వ్యక్తితో సునీతకు పెళ్లి నిర్ణయించారు. గత శనివారం దగ్గరుండి వారి పెళ్లి జరిపించారు. 
 
అత్తమామలను విడిచి వెళ్లేటపుడు సునీత కన్నీళ్లు పెట్టుకుంది. కోడలి పట్ల ఎంతో ఆదరణ చూపించిన కమలా దేవి, దిలావర్ దంపతులపై బంధుమిత్రులు ప్రశంసలు కురిపించారు.