మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మే 2018 (08:35 IST)

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మోడీ కోసం తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించానని, ఇపుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని వ్యాఖ్యానించారు.
 
ఆయన బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు తన అమూల్య సమయాన్ని వెచ్చించానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పారు. మోడీ ప్రధాని అయినా దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ కలగడం లేదన్నారు.
 
ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న రూ.90 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి, ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని మోడీ హామీ ఇచ్చారని, కానీ, ప్రధాని అయ్యాక ఈ హామీనే పూర్తిగా విస్మరించారన్నారు. పైగా, మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఎన్నికల్లో పీకల్లోతు అవినీతిలో కూరుకుని జైలుపాలైన వారందరికీ బీజేపీ టికెట్లు ఎలా ఇచ్చారు? ఇవేనా మీ నైతిక రాజకీయాలు?.. అని జెఠ్మలానీ నిలదీశారు.