మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (22:41 IST)

మంత్రి నాలుక కోస్తే రూ.10 కోట్లు బహుమానం.. అయోధ్య మఠాధిపతి

Ayodhya Swamiji
Ayodhya Swamiji
బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ అధికారంలో ఉంది. ఇటీవల బీహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ రామాయణ కథను తెలిపే రామచరితమానస్ పుస్తకం గురించి మాట్లాడారు. ఇది వివాదానికి కారణమైంది. దీన్ని చాలా మంది ఖండిస్తున్నారు. 
 
ఈ స్థితిలో ఈ పుస్తకంపై దూషించిన మంత్రి చంద్రశేఖర్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని మఠాధిపతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యాశాఖ మంత్రి నాలుక కోసిన వారికి రూ.10 కోట్లు ఇస్తామని అయోధ్య మఠాధిపతి జగద్గురు పరమ హంస తెలిపారు. రామ్‌చరిత్ మానస్ గ్రంథం అందరినీ ఏకం చేసేదే కానీ.. విడదీసేది కాదని స్పష్టం చేశారు. అదో గొప్ప మానవతా గ్రంథమని కితాబిచ్చారు. 
 
సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని అవమానించారంటూ ఫైర్ అయ్యారు. వారం రోజుల్లోపు ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది జరగకపోతే...ఆయన నాలుక కోసిన వారికి బహుమానం ఇస్తానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన భారతీయ జనతా పార్టీ వర్గాల్లో కలకలం రేపింది