సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2023 (12:21 IST)

విమానం నడిపేందుకు శిక్షణ: మెదక్ లో విమానం కూలి ఇద్దరు మృతి

IAF flight crashed
కర్టెసి-ట్విట్టర్
భారత వాయుసేనకు చెందిన శిక్షణ విమానం సోమవారం ఉదయం మెదక్ జిల్లా లోని తూప్రాన్ పరిధిలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు శిక్షకుడు కాగా మరొకరు ట్రైనీ వున్నారు.
 
ఈ ఉదయం మెదక్ వాయుసేన కేంద్రం నుంచి పిలాటియస్ పీసీ 7 ఎంకే శ్రేణికి చెందిన శిక్షణ విమానం బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ట్రెయినింగ్ సమయంలో ప్రమాదానికి గురై కుప్పకూలింది. దాంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ట్రైనీ, శిక్షణ పైలట్ ఇద్దరూ మృతి చెందారు.