బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (10:26 IST)

రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

road accident
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం పాలయ్యారు. కర్నాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టురుగా పనిచేసే మహంతేశ్ బిళగి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన ఘటనా స్థలిలోనే తుదిశ్వాస విడిచారు. అలాగే, ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా చనిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద మహంతేశ్ బిళగి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆయన ఒక పెళ్లికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత మహంతేశ్‌తో పాటు కారులో ఉన్న ఆయన ఇద్దరు బంధువులు కూడా అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు.
 
కాగా, ఈ మరణవార్త తెలిసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహంతేశ్ బిళగి మృతిపట్ల వారు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.