ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (22:33 IST)

చర్చిలో నమాజ్.. ఇఫ్తార్ విందులో చర్చి ఫాదర్..

church
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగిన ఈ అరుదైన సంఘటన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. మహారాష్ట్రలోని ఓ చర్చి మత సామరస్యానికి వేదికైంది. కారణం ఆ చర్చిలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడమే. 
 
నాసిక్ నగరంలోని హోలీ క్రాస్ చర్చిలో ముస్లింలు నమాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు.. క్రిస్టియన్లు, ముస్లింలు కలిసి ఇఫ్తార్ విందును ఆరగించడం అరుదైన ఘటనగా నిలిచింది. ఇఫ్తార్ విందులో క్రిస్టియన్లతో పాటు చర్చి ఫాదర్ కూడా పాల్గొంటారు.
 
దీనిపై ముస్లిం పెద్దలు స్పందిస్తూ.. అందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది మత సామరస్యం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.