బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (14:00 IST)

అతిపెద్ద విమాన వాహక నౌకలో భారీ అగ్నిప్రమాదం

ins vikramaditya
భారత నావికా దళానికి చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ నౌక కర్వార్‌లో విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో ఈ నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు నేవీ అధికారులు వెల్లడించారు. 
 
అయితే, మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తక్షణం మంటలను ఆర్పివేశారు. పైగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 
 
మరోవైపు, ఈ నౌకను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 2014లో ఇది రష్యా నుంచి ఇండియాకు చేరుకుంది. ప్రస్తుతం కర్ణాటక తీరంలోని కార్వార్‌లో ఈ నౌక ఉంది. 
 
ఈ విమాన వాహక నౌకపై మిగ్ 29కే ఫైటర్ జెట్లు, కమోవ్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. 20 అంతస్తుల భవనం అంత ఎత్తును కలిగి ఉంటుంది. ఇండియన్ నేవీలో ఇదే అతి పెద్ద షిప్ కావడం గమనార్హం. దీని బరువు దాదాపు 40 వేల టన్నులు ఉంటుంది.