1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (11:11 IST)

భారత్‌లో 14వేల మార్కును దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు నిలకడ లేకుండా పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు… ఈ రోజున 18 వేల మార్కును దాటాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో… 18,454 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,78,831కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.15శాతంగా ఉంది.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,561 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 34,95,808 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 100 కోట్లకు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59.57లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేట్ 1.34గా నమోదైంది.