శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (17:03 IST)

శుభవార్త చెప్పిన ఐఆర్టీసీ - రైల్వే టిక్కెట్ల బుకింగ్ పరిమితి పెంపు

irctc
ఇండియన్ రైల్వే క్యాటిరింగ్ అండ్ టూరిజం సంస్థ (ఐఆర్‌టీసీ) రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే టిక్కెట్ల బుకింగ్ పరిమితిని పెంచింది. ఆధార్ కార్డుతో అనుసంధానం లేని యూజర్ ఐడీపై నెలలో కేవలం ఆరు టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇపుడు ఈ సంఖ్యను 12కు పెంచింది. అలాగే, ఆధార్ నంబరును అనుసంధానం చేసిన యూజర్ ఐడీపై బుక్ చేసుకునే టిక్కెట్ల సంఖ్య 12 ఉండగా, దీన్ని 24కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది రైలు ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలిగించనుంది. 
 
రైళ్లలో ప్రయాణించే వారు నెలలో ఆరు లేదా 12 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో అంతకు మించి టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇపుడు ఈ పరిమితి సంఖ్యను రెట్టింపు చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ టిక్కెట్లను మిస్‌యూజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఐఆర్టీసీ హెచ్చరించారు.