శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (23:52 IST)

సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న అంబానీ, ఆకాష్.. రూ.1.5 కోట్లు..?

Mukesh Ambani
Mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ.. మహాశివరాత్రి సందర్భంగా గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. 
 
ఆలయంలో ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలు శివుడికి అభిషేకం చేసి పూజలు చేశారు. అలాగే దర్శనానంతరం సోమనాథ్ ఆలయ ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు. 
 
పరమ శివునికి అంకితభావంతో, అంబానీ కుటుంబం వారి సంప్రదాయాలకు కట్టుబడి అన్ని హిందూ పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. 
Mukesh Ambani
Mukesh Ambani
 
ఆలయ ట్రస్టు తరపున ఆయనకు ట్రస్టు అధ్యక్షుడు పి.కె. లాహిరి, కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ వీరికి స్వాగతం పలికారు. ఆలయ పూజారి గౌరవ సూచకంగా చందనం పూశారు.