సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (16:19 IST)

కృత్రిమ మోకాలిని తయారుచేసిన ఇస్రో... బరువు కేవలం 1.6కేజీలే

artificial knee
artificial knee
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మైక్రో ప్రాసెసర్‌తో నడిచే ఓ కృత్రిమ మోకాలిని తయారు చేసింది. దీన్ని మైక్రో ప్రాసెసర్ నియంత్రిత మోకాలు (ఎంపీకే) అని పిలుస్తారు. ఇది అత్యంత తేలికగా వుంటుందని.. దీని బరువు కేవలం 1.6 కేజీలు అని ఇస్రో తెలిపింది.

ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగడుతుంది. అంతేకాదు, మార్కెట్లో లభించే కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ ఎలక్ట్రానిక్ మోకాలు ధర చాలా చౌక అని అంటున్నారు. 
 
భారత్‌లో ప్రస్తుతం లభించే కృత్రిమ మోకాలు ధర రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుంది. ఇవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అయితే ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ఎంపీకే వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి అయితే, ఇవి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపే లభించవచ్చని తెలుస్తోంది. ఈ ఎంపీకే సాయంతో ఎంతో సులువుగా నడవొచ్చని, దివ్యాంగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇస్రో పేర్కొంది.